Brahmotsavams & Vaarshikotsavams :
Brahmotsavam will start on the evening of Magha Sudha Padyamiwith Ankurarpana puja. Then on the last day Magha Sudha Shashti, the festival ends with auspicious ‘Chakra Snanam’ and ‘Maha Poornahuthi’ followed by Annasantarpana.
Kalyanotsavam, will be held on the fourth day of the Brahmotsavam Day.
బ్రహ్మోత్సవం:
అంకురార్పణ పూజతో మాఘ శుద్ధ పాడ్యమి సాయంత్రం బ్రహ్మోత్సవం ప్రారంభమౌతుంది. మాఘ శుద్ధ షష్టి రోజున ‘చక్రస్నానం‘ మరియు ‘మహాపూర్ణాహుతి‘తో పండుగ ముగుస్తుంది.
బ్రహ్మోత్సవం నాల్గవ రోజైన మాఘ శుద్ధ చవితి నాడు కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది.
బ్రహ్మోత్సవం ముగింపు రోజున ఆలయము నందు ‘అన్నదానం’ చేస్తారు.
Pavitrotsavams:
This is also one of the important rituals of the temple. It will be held annually especially on Ashvayuja Shuddha Chaturdasi, Ashvayuja Shuddha Purnima and Ashvayuja Bahula Padyami.
పవిత్రోత్సవం:
దేవాలయంలో ఆచరించే ముఖ్యమైన ఉత్సవాల్లో ఇది ఒకటి. ప్రతి యేటా ప్రత్యేకంగా ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి, ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ మరియు ఆశ్వయుజ బహుళ పాడ్యమి నాడు నిర్వహించబడుతుంది.
Maha Sudarshana Homam:
This special homam will be held every month on the second Sunday or the third Sunday. According to the Telugu calendar, each month holds its own importance and thus according to that ‘Maha Sudarshana Homam’ will be held in 4 different ways…Nrusimha Maha Sudarshana Homam, Nava Graha Shanti Purvaka Sudarshana Homam, Sarvakamaprada Mahalakshmi Sudarshana Homam, Danvantri Mantra Samputikarnam Sudarshana Homam.
మహాసుదర్శన హోమం:
ప్రత్యేక హోమం ప్రతి నెల రెండవ ఆదివారం లేదా మూడవ ఆదివారం నిర్వహించబడుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి మాసానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఆయా ప్రాముఖ్యతల ప్రకారం ‘మహాసుదర్శన హోమం‘ 4 రకాలుగా నిర్వహించబడుతుంది.. నృసింహ మహాసుదర్శన హోమం, నవగ్రహ శాంతి పూర్వక సుదర్శనహోమం, సర్వకామప్రద మహాలక్ష్మి సుదర్శనహోమం, దన్వంతరి మంత్ర సంపుటికరణతో సుదర్శన హోమం.
Masa Kalyanostavam:
Every month on Sravananakshatram, Kalyanostavam will be held in a grand way. On the request of devotees, ‘Kalyanam’ will be performed on any other day, according to the availability. At times, this special ritual will be held twice in a month.
మాసకల్యాణోత్సవం:
ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల అభ్యర్థన మేరకు, సమయానుకూలతను బట్టి మరే ఇతర రోజైనా ‘కళ్యాణం‘ నిర్వహిస్తారు. కొన్నిసార్లు, ఈ ప్రత్యేక సేవ నెలలో రెండుసార్లు జరుగుతుంది.
Karthika Masa:
Vishnusahasranama Parayana Sahita Akasa Deepaaradhna As Karthika Masam holds special importance in the Telugu calendar, this special pooja will be held on all days of this month. Every evening after chanting Vishnusahasra Nama Parayanam, special Archana and Akashadeeparadhana will be done.
కార్తీకమాసం:
విష్ణు సహస్ర నామ పారాయణ సహిత ఆకాశ దీపారాధన
తెలుగు పంచాంగంలో కార్తీక మాసానికి విశేష ప్రాధాన్యత ఉన్నందున, ఈ నెలలోని అన్ని రోజులలో ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం విష్ణు సహస్ర నామ పారాయణం పూర్తైన తర్వాత ప్రత్యేక అర్చన, ఆకాశ దీపారాధన నిర్వహిస్తారు.
Dhanurmasam Sevas:
Every year December 16th or 17th after Dhanushsankramanam, special poojas will be held in the early mornings. They will be held for one month (till 13th or 14th January) until the Pongal festival starts. The rituals begin early in the morning from 5:30 AM.
Even Goda Ranganadula Vishesha Archana, Tiruppavai Seva Kalam, Mutyala Harati, Kudarai Utsavamsevas and Godha Kalyanam on the Bhogi festival are performed in the temple this month.
And also devotees are specially allowed to perform ‘Laksha Pushparchana’ to Sri BhuNeela Sametha Malayappa Swamy and Godharanganatha Swamy (Utsava) deities while reciting Vishnu Sahasranamalu, eleven times.
On ‘Vaikunta Ekadasi’ day, Temple will be decorated with variety of flowers to look like a Heaven. Morning 4:00 AM, Darshan Ticket Rs.50/- will be performed. Afterwards, the devotees will be allowed to seek the blessings of God through ‘Uttara Dwara Darshanam’ from 5:30 AM onwards.
ధనుర్మాసం సేవలు:
ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 లేదా 17వ తేదీల్లో ధనుస్సంక్రమణం తర్వాత తెల్లవారు ఝామున ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ ప్రారంభమయ్యే వరకు (జనవరి 13 లేదా 14) ఒక నెల పాటు పూజలు జరుగుతాయి. ఈ పూజలు ఉదయం 5:30 నుండి ప్రారంభమవుతాయి.
ఈ మాసంలో భోగి పండుగ రోజున గోదా రంగనాధుల విశేష అర్చన, తిరుప్పావై సేవ కాలం, ముత్యాలహారతి, కూడారై ఉత్సవ సేవలు, గోదాకళ్యాణం కూడా నిర్వహిస్తారు.
శ్రీ భూ నీలా సమేత మలయప్ప స్వామికి, గోదా రంగనాధుల వారికి భక్తులచే 11 సార్లు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణతో ‘లక్ష పుష్పార్చన’ చేసేందుకు ప్రత్యేకంగా అనుమతిస్తారు.
దేవాలయమును వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాల అలంకరణతో ఎంతో రమణీయముగా, సుందరముగ అలంకరిస్తారు.
‘వైకుంఠ ఏకాదశి’ నాడు ఉదయము 4:00 గంటలకు రుసుము రూ. 50/- జరుగును. తదుపరి అర్చనలు జరుగును. ఉదయం 5:30 గంటల నుండి ‘ఉత్తర ద్వార దర్శనం’ ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందేందుకు భక్తులను అనుమతిస్తారు.
Garuda Seva:
This special pooja will be held occasionally in the temple on ‘Full Moon day (Pournami).
గరుడ సేవ:
ప్రత్యేక సందర్భములలో, పౌర్ణమి రోజున ఆలయంలో గరుడ సేవ ప్రత్యేక పూజ జరుగుతుంది.
పైన పేర్కొన్న పూజలతో పాటు, ఆలయ అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకుని భక్తులు తమ పిల్లల ‘నామకరణ మహోత్సవం’ మరియు అన్నప్రాసన వంటి వేడుకలు నిర్వహించడానికి అనుమతించబడతారు.
Devotees are allowed to organise ‘Namakarana Mahostavam’
Annaprasana and Aksharabhyasam rituals for their kids seeking prior permission from the temple authorities.