Dhanurmasam Sevas:
Every year December 16th or 17th after Dhanushsankramanam, special poojas will be held in the early mornings. They will be held for one month (till 13th or 14th January) until the Pongal festival starts. The rituals begin early in the morning from 5:30 AM.
Even Goda Ranganadula Vishesha Archana, Tiruppavai Seva Kalam, Mutyala Harati, Kudarai Utsavamsevas and Godha Kalyanam on the Bhogi festival are performed in the temple this month.
And also devotees are specially allowed to perform ‘Laksha Pushparchana’ to Sri BhuNeela Sametha Malayappa Swamy and Godharanganatha Swamy (Utsava) deities while reciting Vishnu Sahasranamalu, eleven times.
On ‘Vaikunta Ekadasi’ day, Temple will be decorated with variety of flowers to look like a Heaven. Morning 4:00 AM, Darshan Ticket Rs.50/- will be performed. Afterwards, the devotees will be allowed to seek the blessings of God through ‘Uttara Dwara Darshanam’ from 5:30 AM onwards.
ధనుర్మాసం సేవలు:
ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 లేదా 17వ తేదీల్లో ధనుస్సంక్రమణం తర్వాత తెల్లవారు ఝామున ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ ప్రారంభమయ్యే వరకు (జనవరి 13 లేదా 14) ఒక నెల పాటు పూజలు జరుగుతాయి. ఈ పూజలు ఉదయం 5:30 నుండి ప్రారంభమవుతాయి.
ఈ మాసంలో భోగి పండుగ రోజున గోదా రంగనాధుల విశేష అర్చన, తిరుప్పావై సేవ కాలం, ముత్యాలహారతి, కూడారై ఉత్సవ సేవలు, గోదాకళ్యాణం కూడా నిర్వహిస్తారు.
శ్రీ భూ నీలా సమేత మలయప్ప స్వామికి, గోదా రంగనాధుల వారికి భక్తులచే 11 సార్లు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణతో ‘లక్ష పుష్పార్చన’ చేసేందుకు ప్రత్యేకంగా అనుమతిస్తారు.
దేవాలయమును వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాల అలంకరణతో ఎంతో రమణీయముగా, సుందరముగ అలంకరిస్తారు.
‘వైకుంఠ ఏకాదశి’ నాడు ఉదయము 4:00 గంటలకు రుసుము రూ. 50/- జరుగును. తదుపరి అర్చనలు జరుగును. ఉదయం 5:30 గంటల నుండి ‘ఉత్తర ద్వార దర్శనం’ ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందేందుకు భక్తులను అనుమతిస్తారు.